పైరసీ నెట్‌వర్క్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు అకౌంట్లను సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్లలో నిలిచిపోయిన సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసి వాడుకునేందుకు మాత్రం అనుమతి లభించలేదు. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉందని ఐబొమ్మ రవి కోర్టును ఆశ్రయించగా.. ఈ ఉత్తర్వులు ఇచ్చింది.


