HomeEntertainmentబిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ స్వాగ్… ‘ది ప్యారడైజ్’కి కేటీఆర్ మద్దతు, చాలాకాలం తర్వాత థియేటర్‌కి

బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ స్వాగ్… ‘ది ప్యారడైజ్’కి కేటీఆర్ మద్దతు, చాలాకాలం తర్వాత థియేటర్‌కి

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థియేటర్‌కు వెళ్లనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తన అభిమాన నటుడు నాని నటించిన ఈ సినిమాను థియేటర్‌లోనే వీక్షించబోతున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్ అన్న’ పాత్ర తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆహార్యాన్ని పోలి ఉండటం, ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు రావు థియేటర్‌లో ఈ చిత్రం చూడటంతో కేటీఆర్ రాక రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments