HomeEntertainmentబాలయ్య బాబు భయపడేది ఆ ఒక్కరికే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో లోకేష్ క్రేజీ కామెంట్స్

బాలయ్య బాబు భయపడేది ఆ ఒక్కరికే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో లోకేష్ క్రేజీ కామెంట్స్

ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 టాక్ షోకి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో లోకేష్ ఎంతో హుషారుగా ‘జై బాలయ్య’ అంటూ వేదికపై సందడి చేశారు. చిన్ననాటి పాఠశాల రోజుల్లో తాను తిన్న దెబ్బల జ్ఞాపకాలను సరదాగా గుర్తుచేసుకోవడంతో పాటు, తన మావయ్య బాలకృష్ణ జీవితంలో ఎవరికి భయపడతారో చెబుతూ ఆసక్తిని రేకెత్తించారు. చివర్లో బాలయ్య సూపర్ హిట్ డైలాగ్ “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” చెప్పి ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 6న జీ5లో, నవంబర్ 8న జీ తెలుగులో ప్రసారం కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments