పిల్లల్ని కనాలనుకోవడానికి, ఓ బిడ్డ పుట్టిన తర్వాత మారే జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా చాలా మంది పిల్లలు కావాలనుకున్నప్పుడు వారికి ఏ పేర్లు పెట్టాలి, వారికి ఏ డ్రెస్సులు కొనాలి, ఎలాంటి ఆటబొమ్మలు కొనాలి అంటూ రకరకాలుగా డిస్కస్ చేసుకుంటారు. లేదంటే పుట్టబోయే బిడ్డ ఎవరి పోలికలతో ఉంటుందనే విషయాలపై ఎంతో ఉత్సాహం చూపిస్తారు.
అయితే, ఈ విషయాల కన్నా ముఖ్యమైనవి.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా కాపాడేవి అయిన మనీ, కెరీర్, బాధ్యతలు, అభిప్రాయ భేదాల వంటి అంశాల్ని పెద్దగా పట్టించుకోరు. పేరెంట్స్ అయ్యే సమయానికి ప్రతి విషయంలోనూ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాల్సిన పనిలేదు. కానీ.. ఒకరి నుంచి మరొకరు ఏం ఆశిస్తున్నారనే దానిపై ముందే స్పష్టత ఉండాలి. అలా అయితేనే భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని నివారించవచ్చు. పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు ప్రతి జంట స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన 5 విషయాలపై ఓ లుక్కేద్దాం.


