పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన తీవ్ర ఇంధన కొరత, సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ క్యాబినెట్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇంధన అలవెన్సుల్లో 50 శాతం కోత విధించడంతో పాటు విదేశీ పర్యటనలపై 3 నెలల నిషేధం విధించింది. అంతేకాకుండా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ఒకే వంటకం మాత్రమే పెట్టాలని, రాత్రి 9 గంటలకే షాపులు మూసివేయాలంటూ కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. ఇదంతా సంక్షోభం నుంచి బయటపడడానికి చేసిందే అని తెలుస్తోంది.
పాకిస్థాన్ పెళ్లిళ్లలో ఒకే వంటకం.. రాత్రి 9కే షాపులు బంద్.. కారణం ఏంటంటే?
RELATED ARTICLES


