ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. గతవారం జరిగిన ముంబయి నగరంలో జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. తన కారుపై నిందితులు ఆరు రౌండ్లు కాల్పలు జరపడంతో ఆయన డ్రైవర్, వ్లాగర్ గాయపడ్డారు. తాజాగా, ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు టైగర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా తనకి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఎందుకు టార్గెట్ చేశారో తెలియదని వాపోయారు.


