తన బాధ చెప్పుకోడానికి వచ్చిన రైతన్న పట్ల ఓ రెవెన్యూ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. అతడ్ని ఓదార్చిల్సింది పోయి.. ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా’ అంటూ అవహేళన చేసిన మాట్లాడారు. భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఒక రైతు తన సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి రాగా.. గజ్వేల్ MRO స్వామి ఆయనను ఘోరంగా అవహేళన చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్నదాత సమస్యపై అధికారుల స్పందన ఇదేనా అంటూ మండిపడుతున్నారు.


