సాధారణంగా వేసవిలో నీటి సమస్య తలెత్తుతుంది. కానీ ఈసారి వర్షాభావం కారణంగా నగరాల్లో అక్టోబర్లోనే నీటి సమస్యలు మొదలయ్యాయి. హైదరాబాద్లో వేసవిలో బుక్ చేసిన స్థాయిలో ఇప్పుడే ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ పిలుపునిస్తోంది. తాగునీటిని వృథా చేసే వారిపై రూ. 5 వేలు జరిమానా విధించనున్నట్లు జలమండలి ప్రకటించింది. ఈ నిబంధన నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లకు సైతం వర్తిస్తుందని జలమండలి అధికారులు తెలిపారు.


