నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో జులై 20న విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సమయంలో విద్యార్థులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసి, పెల్లెట్స్, వాటర్ క్యానన్లను పోలీసులు ప్రయోగించారు. అలాగే, నిరసనకారులపై కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసులను రద్దుచేస్తామని సీజేపీతో చర్చల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. నెల రోజుల గడిచిపోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, సెప్టెంబరు 5న మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కేసులను తాజాగా రద్దుచేసింది.
నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు బిగ్ రిలీఫ్: కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబరు 5 ర్యాలీ రద్దుచేసిన సీజేపీ
RELATED ARTICLES


