సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రి బాయి శనివారం ఉదయం కన్నుమూశారు. 85 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం సంతుక్ పింప్రిలో మృతి చెందారు. ఈ మరణవార్తను దీప్కేకు చేరవేసిన ఢిల్లీ పోలీసులు.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి సాయం చేస్తామని తెలిపారు. అయితే, వెళ్లాలా? వద్దా? అనేది దీప్కే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.


