మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ధరించిన ఒక టీషర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల ఓ టీవీ షో షూటింగ్ పాల్గొన్న రోహిత్ ‘నాన్ కమిటల్’ (కమిట్మెంట్ లేని) అని ఉన్న టీషర్ట్ ధరించాడు. 2027 వరల్డ్ కప్లో ఆడటంపై గతేడాది చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలకే రోహిత్ ఈ రూపంలో కౌంటర్ ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా, 2027 ప్రపంచకప్లో ఆడతారనే ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ అది ఇంకా చాలా దూరంలో ఉందని పేర్కొన్నాడు.


