HomeNation and World"నా ప్రపంచాన్నే కోల్పోయాను": ఐదేళ్ల కుమార్తెను భార్యే చంపడంతో తల్లడిల్లిపోతున్న భారత సంతతి తండ్రి

“నా ప్రపంచాన్నే కోల్పోయాను”: ఐదేళ్ల కుమార్తెను భార్యే చంపడంతో తల్లడిల్లిపోతున్న భారత సంతతి తండ్రి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటుచేసుకున్న అత్యంత హృదయ విదారక, దిగ్భ్రాంతికరమైన ఘటన స్థానికులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే తన ఐదేళ్ల కుమార్తెను అత్యంత దారుణంగా చంపేసింది. ఆపై స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేసి తన కూతురిని హత్య చేసినట్లు చెప్పింది. ఈ ఘోర ఉదంతం అమెరికాతో పాటు భారత్‌లోని బంధువులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అకస్మాత్తు విషాదంతో సర్వస్వం కోల్పోయిన భారతీయ సంతతి తండ్రి కుల్దీప్ సింగ్.. తన గారాల పట్టికి తుది వీడ్కోలు పలికేందుకు, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం కోరుతూ కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరినీ కలచివేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments