మెదక్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందులో ఒక యువకుడు మృతి చెందడం తీవ్ర దుమారం రేపుతోంది. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి.. ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


