ఎస్ఐఆర్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో అదనపు షరతులు, సాఫ్ట్వేర్ ఆధారిత గుర్తింపులు, పేర్ల చేర్పులు, తొలగింపుల విధానాలపై ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న డిజిటల్ వ్యవస్థలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని.. సంబంధిత అధికారిక రికార్డులను వెల్లడించాలని కూడా కోరారు.


