తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో తెలంగాణ సర్కార్ పట్టు వీడటం లేదు. ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లు ఉండాలని తేల్చి చెబుతోంది. ఢిల్లీలో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య కీలక భేటీ జరిగింది. గతంలో 148 మీటర్ల ఎత్తుకు అంగీకారం ఉన్నప్పటికీ.. గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం, భవిష్యత్లో విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు 152 మీటర్ల ఎత్తు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. 152 మీటర్లకు అంగీకారం కుదరకపోతే కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా ఒప్పుకోవాలని తెలంగాణ కోరినట్లు తెలుస్తోంది.


