ఓట్ల చోరీ జరిగిందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ అందుకు సహకరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే విపక్ష ఇండియా కూటమి నిరసనలు హోరెత్తిస్తోంది. అటు, కాక్రోచ్ జనతా పార్టీ సైతం దీనిపై ఉద్యమాన్ని మొదలుపెట్టింది. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2. 0 నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై.. కఠిన ఆంక్షలు విధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిన మెట్రో, రైలు సర్వీసులు నిలిపివేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న మాజీ సీఎంలను అదుపులోకి తీసుకున్నారు.


