ఆరోగ్యం అనగానే చప్పగా ఉండే ఆహారమే తినాలా, నోరూరించే పచ్చళ్లను పూర్తిగా దూరం పెట్టాలా అంటే అవసరం లేదనే చెప్పొచ్చు! మన వంటింట్లోని వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే శక్తివంతమైన సహజ ఔషధం. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడే ఈ వెల్లుల్లిని రుచికరమైన పచ్చడిలా మారిస్తే? పక్కా కొలతలతో, నూనె, కారం సమపాళ్లలో వేసి చేస్తే రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. మందుల అవసరం లేకుండా రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ ఆయుర్వేద నిధి మీ ఇంటి భోజనంలోకి వస్తే.. ఇక రుచికి వంక లేదు.. ఆరోగ్యానికి తిరుగు లేదు.. ఆ ఫర్ఫెక్ట్ రెసిపీ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం..


