HomeLifestyleకిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా ఎదురుచూడకండి, ఇప్పుడు చెప్పే లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి!

కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా ఎదురుచూడకండి, ఇప్పుడు చెప్పే లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి!

భారతదేశంలో కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD), కిడ్నీలో రాళ్లు, అక్యూట్ కిడ్నీ ఇంజురీ వంటి అనేక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. భారత్‌లోని పెద్దవారిలో దాదాపు 13% నుంచి 16% మంది CKD సమస్యతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరంగా పట్టణ ప్రాంతాల (10.65%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (15.34%) ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాల్ని తొలగించడం, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడం మూత్రపిండాల ప్రధాన పని. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక మాంసాహారం, మితిమీరిన ఉప్పు వాడకం, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.

20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు (KFT) చేయించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది. అసలు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) అంటే ఏంటి, అందులో ఏయే పరీక్షలు ఉంటాయి, ఏ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ క్రిస్టిన్ జార్జ్ (కన్సల్టెంట్ – నెఫ్రాలజిస్ట్ & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments