HomeHeadlinesకర్నూలు జిల్లా నుంచి ఐదుగుర్ని బహిష్కరించిన కలెక్టర్, ఎస్పీ.. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

కర్నూలు జిల్లా నుంచి ఐదుగుర్ని బహిష్కరించిన కలెక్టర్, ఎస్పీ.. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

Kurnool District Five Externed: కర్నూలు జిల్లా నుంచి ఐదుగుర్ని బహిష్కరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలో రౌడీషీటర్లు వడ్డె రామాంజనేయులు అలియాస్‌ వడ్డె అంజి, వడ్డె తులసి కుమార్‌, వడ్డె రేవంత కుమార్‌, వడ్డె శివకుమార్‌లతో పాటు సస్పెక్ట్‌ షీటర్‌ పఠాన ఇమ్రాన్ ఖానలపై జిల్లా బహిష్కరణ వేటు వేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments