వర్షాకాలం మొదలైందంటే ఎండలు తగ్గుతాయని అనుకుంటాం. కానీ ఈ మధ్య వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండటం.. మధ్యాహ్నానికి ఉక్కపోత పెరగడం.. బయటకు వెళ్తే చెమటలు పట్టడం వంటి పరిస్థితులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో దాహం ఎక్కువగా వేయడం, నీరసం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా బయట ఎక్కువసేపు ఉండేవారిలో శరీరం నుంచి నీరు, లవణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
అంతేకాదు ఒంట్లో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమయంలో తగినంత ద్రవాలు తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మరి వర్షాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని ఎలా చల్లగా, హైడ్రేట్‌గా ఉంచుకోవాలి, ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


