వాయూవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిపింది. దాంతో తీరం వెంట 40 – 50 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. హోం, విపత్తుల శాఖ మంత్రి అనిత కూడా దీనిపై అధికారులను అప్రమత్తం చేశారు.
ఏపీ ప్రజలకు చల్లటి వార్త.. అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం
RELATED ARTICLES


