బాలీవుడ్‌లో ఇటీవల జరిగిన ఐటీ సోదాల నేపథ్యంలో తనపై వస్తున్న నిరాధార కథనాలపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు ఎవరూ ఎలాంటి ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని, దేశంలోగానీ విదేశాల్లోగానీ తనకు ఎటువంటి బినామీ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. అలాగే అక్రమ విదేశీ లావాదేవీలతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన తాను 20 ఏళ్ల వయస్సు నుంచే నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు. రేటింగుల కోసం వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఒకరి ప్రతిష్టను దిగజార్చేలా వార్తలు రాయడం సరికాదని, తప్పుడు కథనాలను ప్రచురించిన సంస్థలు వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఎవరూ నాకు ఆస్తులు గిఫ్ట్‌గా ఇవ్వలేదు… నిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాయొద్దు – రకుల్ ఆగ్రహం
RELATED ARTICLES


