క్యూర్ పరిధిలో నిర్మించనున్న 7340 ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన 60,720 దరఖాస్తుల్లో సుమారు 40 వేల మందిని అధికారులు ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, మొబైల్ లేదా ఆధార్ ద్వారా తమ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అనర్హులుగా తేలితే ‘Raise Claim’ అనే ఆప్షన్ ద్వారా కారణాలను పరిశీలించి, వివరాలు తప్పుగా ఉంటే ఆధార పత్రాలతో అభ్యంతరం నమోదు చేయవచ్చు.


