పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్‌కి దారితీసే ఓ పరివర్తన దశ. ఈ సమయంలో అండాశయాలు క్రమంగా తక్కువ ఈస్ట్రోజెన్‌ని ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్స్ లెవల్స్ అనూహ్యంగా హెచ్చుతగ్గులకి లోనవుతాయి. ఈ హార్మోన్ల అస్థిరత కారణంగా ఆడవారికి ఇరెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు మరికొన్ని సమస్యలొస్తాయి. వాటన్నింటినీ ముందుగానే గుర్తించి సరైన డైట్, జాగ్రత్తలు తీసుకుంటే సమస్యని చాలా వరకూ కంట్రోల్ చేయొచ్చొని డాక్టర్ వై.దివిషా రెడ్డి(గైనకాలజిస్ట్ అండ్ ప్రసూతి వైద్య నిపుణురాలు, గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్వర్క్, లక్డికాపూల్) చెబుతున్నారు.


