టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోనా వెంకట్ ప్లానింగ్ లేకుండా సినిమాలు తీసే దర్శకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దాదాపు 3 గంటల 50 నిమిషాలు తీసి అందులో గంటన్నర ఫుటేజీని ఎడిటింగ్‌లో తొలగిస్తే లాభమేంటని ప్రశ్నించారు. అలా తొలగించిన ఫుటేజీకి వృథా అయ్యే కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చిన నిర్మాతవి కావా అని నిలదీశారు. కనీస స్పృహ, ప్రణాళిక లేకుండా నిర్మాతల కుటుంబాలను రోడ్డున పడేసే అలాంటి బాధ్యతారాహిత్య దర్శకులు పరిశ్రమకు క్రిమినల్స్‌తో సమానమని, వారిని చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని ఘాటుగా హెచ్చరించారు.
‘అలాంటి డైరెక్టర్లు క్రిమినల్స్‌తో సమానం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి’: కోనా వెంకట్ ఆగ్రహం
RELATED ARTICLES


