Varalakshmi Vratam 2026L: వరలక్ష్మీ వ్రతం 2026 రోజు ఇంట్లో ప్రతి పని ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ఉదయాన్నే పూజా ఏర్పాట్లు మొదలవుతాయి.. పూలతో ఇంటిని అలంకరించడం, అమ్మవారిని అందంగా ముస్తాబు చేయడం, పసుపు-కుంకుమలతో పూజా సామగ్రిని సిద్ధం చేయడం, ముత్తైదువులను ఆహ్వానించడం ఇలా ఒక్కొక్క పనితో ఇల్లు సందడిగా మారుతుంది. ఈ పండుగలో మరో ప్రత్యేకత అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అయితే పూజా పనులు, ఇంటి అలంకరణ, ముత్తైదువులను ఆహ్వానించడం వంటి పనులతో బిజీగా ఉండే సమయంలో గంటల తరబడి వంటగదిలో గడపడం కష్టంగా ఉంటుంది.
అందుకే ఎక్కువ సమయం పట్టకుండా, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల సంప్రదాయ వంటకాలను ఎంచుకుంటే పని సులభమవుతుంది. ఈసారి వరలక్ష్మీ వ్రతం నైవేద్యానికి కుడుములు, పూర్ణాలు, పరమాన్నం, పులిహోర, సున్నుండలు వంటి ఐదు రకాల వంటకాలను ప్రయత్నించవచ్చు. వీటిలో కొన్ని తీపి రుచిని అందిస్తే, పులిహోర పుల్లదనం అందరి ఫేవరెట్ మరి ఈ వంటకాలను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం..


