రూ.2000, ఆపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవి అక్టోబరు నుంచి అమల్లోకి రానుండగా.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొబైల్ రిటైర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలుకాగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమలు నిలిపివేతకు నిరాకరించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఆర్బీలకు నోటీసులు జారీచేసింది.


