UFBU-IBA Meeting: బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలతో పాటు పాత పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలను కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 4వ తేదీన ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్తో ఉద్యోగులు సమావేశమై చర్చించినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సమ్మె యథాతథంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. మరి ఆ తేదీలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


