Telangana BDS Admissions : తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరానికి బీడీఎస్ ప్రవేశాల తొలి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.


