ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ (ఏజేయూపీ) చీఫ్ హుమాయున్ కబీర్ ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెజీనగర్తోపాటు నౌడా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెజీనగర్ స్థానాన్ని ఆయన వదులుకోవడంతో ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికల వేళ రెజీనగర్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం రెండూ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మధురాంతకం నియోజకర్గంలో 2.13 లక్షల ఓట్లు ఉండగా.. ఉపఎన్నికలో 27 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే మరగనాథం కుమారవేల్ టీవీకే నుంచి పోటీ చేయగా.. డీఎంకే నుంచి పరాంతమన్, అన్నాడీఎంకే నుంచి కణిత సంపత్, ఎన్టీకే నుంచి జి.జానకీరామన్, సీపీఐ(ఎం) నుంచి పి.సుగంతి పోటీ చేశారు. మరగనాథం కుమారవేల్ అన్నాడీఎంకేకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఏప్రిల్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురాంతకంలో 93.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉపఎన్నికలో 86.26 శాతం పోలింగ్ నమోదైంది.


