Brent Crude Oil Price: గత వారం భారీగా పుంజుకున్న భారతీయ స్టాక్ మార్కెట్ మళ్లీ కుప్పకూలింది. మరోసారి బ్లాక్ మండేను గుర్తుచేసింది. అక్టోబర్ 19 సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. పలు హెవీవెయిట్ స్టాక్స్ దారుణంగా నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ పడిపోతుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్ స్వల్పంగా రాణిస్తున్నాయి. ఇన్వెస్టర్లకు ఇవాళ్టి సెషన్లో రూ. 5 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.


