దేశవ్యాప్తంగా పండగల సందడి మొదలైంది. స్కూళ్లు, ఆఫీసులకు పండగ సెలవులు వస్తున్నాయి. దీంతో ఇళ్లకు బంధువుల రాక మొదలైంది. అయితే, ఇంట్లో మురికి వస్తువులుంటే మనకే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పండగల సమయంలో ఇంట్లో విలువైన వస్తువుల దగ్గర నుంచి చిన్న చిన్న వాటి వరకు అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. అలాంటి వాటి సోఫా ఒకటి. అయితే, చాలా మంది సోఫాను క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ కంపల్సరీ అని అనుకుంటారు. కానీ అది ఇంట్లో లేనంత మాత్రాన సోఫాపై పడ్డ దుమ్మును, మురకల్ని ప్రొఫెషనల్ క్లీనర్లను పిలిచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు.
కాలం గడిచేకొద్దీ ఇంట్లో ఉండే సోఫాలపై దుమ్ము, రాలిన వెంట్రుకలు, ఆహారపు ముక్కలు, చెమట పేరుకుపోతాయి. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడమే కాకుండా అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. సరైన పద్ధతి పాటిస్తే మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే సోఫాను శుభ్రంగా మార్చుకోవచ్చు. ఆ పద్ధతులు, చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.


