నవరాత్రుల వేళ అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో కదంబం ఒకటి. చాలా మంది దీనిని సాంబార్ రైస్ లేదా బిసిబేళా బాత్ అనుకుంటారు. కానీ, కదంబం వేరు. ఉల్లి, వెల్లుల్లి అస్సలు వాడరు కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఇది బెస్ట్. కదంబం ప్రసాదం తయారీకీ కావాల్సిన పదార్థాలేంటి, తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.


