HomeEntertainmentNani: మూడు రోజుల్లో రూ.136 కోట్ల కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు

Nani: మూడు రోజుల్లో రూ.136 కోట్ల కలెక్షన్స్… బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మాస్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. తొలి రోజున రూ.88 కోట్లు, రెండో రోజుతో కలిపి రూ.114 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఆదివారం నాటికి ఏకంగా రూ.136 కోట్ల మైలురాయిని అధిగమించింది. విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వ్యక్తమైనప్పటికీ, సింగిల్ స్క్రీన్లలో మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘జాదల్ జమానా’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments