ITR Refund: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న ట్యాక్స్ పేయర్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.2.20 లక్షల కోట్ల రీఫండ్ సొమ్మును ట్యాక్స్ పేయర్లకు అందించినట్లు తాజాగా ఐటీ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 17వ తేదీ నాటికి ఉన్న ట్యాక్స్ కలెక్షన్స్, రీఫండ్స్, అడ్వాన్స్ ట్యాక్స్ గణాంకాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రీఫండ్ల జారీ 29 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


