మన వంటగదిలో ఎన్నో పదార్థాలు వాడుతుంటారు. వంటల కోసం మసాలాలు, పొడులు, ఉప్పు, పసుపు వంటివి ఎన్నో ఉపయోగిస్తాం. అలానే మన వంటగదిలో రోజూ ఎక్కువగా వినిపించే రెండు పేర్లు ఉప్మారవ్వ, ఇడ్లీ రవ్వ. మొదటి దానితో కమ్మని ఉప్మా చేసుకుని ఆస్వాదిస్తే.. రెండో దాంతో ఇడ్లీలు చేసుకూని తింటుంటాం. అయితే, చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ చూడటానికి ఒకేలా అనిపిస్తాయి.
దీంతో, ఈ రెండు ఒకేలా తయారవుతాయని అనుకుంటారు. అయితే, రెండూ నూకలాగా కనిపించినప్పటికీ వీటి తయారీ విధానం, వంటల్లో ఉపయోగించే తీరు పూర్తిగా వేర్వేరు. ఈ తేడా తెలియక ఒకదానికి బదులు మరొకటి వాడితే వంటలు తేడా కొట్టే ప్రమాదం ఉంది. అసలు ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి, వేటిని దేనితో తయారు చేస్తారు అన్న పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.


