
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఆన్లైన్ పోర్టల్‌ను సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. పీఎఫ్ విత్‌డ్రాయల్స్, కేవైసీ వివరాల సవరణ, యూఏఎన్ (UAN) యాక్టివేషన్ వంటి అనేక కీలక సేవలను ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కంపెనీల సహాయం లేకుండా నేరుగా ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.


