Dividend: ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి అక్టోబర్ 24వ తేదీలోపు డివిడెండ్ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఏకంగా 800 శాతం డివిడెండ్ ఇస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. మరి ఈ డివిడెండ్, స్టాక్ ర్యాలీ వంటి పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


