Actress Anangsha Biswas About Vulgar Messages: ప్రసిద్ధ ఓటీటీ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో జరీనా పాత్రతో గుర్తింపు పొందిన నటి అనంగ్షా బిస్వాస్ నెటిజన్ల అసభ్యకర వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై బోల్డ్ పాత్రలు పోషించినంత మాత్రాన నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకోవడం సరికాదన్నారు.
‘నా అమెరికా పర్యటనను అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు’.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పర్యటనను అడ్డుకున్నా.. తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్ సీఎంకు అనుమతిచ్చి.. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా ప్రధాని మోదీ తెలంగాణపై చూపిస్తున్న వివక్ష అని తీవ్రంగా మండిపడ్డారు.
22ఏ నిషేధిత భూముల అంశంలో భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. 22ఏకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన కేసులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. కొన్ని కేసులు 24 గంటల్లోనే క్లియర్ చేస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు భారీ స్పందన వచ్చినట్లు వెల్లడించారు.

