డెస్క్ పనిచేసేవారితో పాటు చాలా మందికి తరచూ నడుము నొప్పి వేధిస్తుంటుంది. అయితే రోజూ ఈ యోగాసనాలు వేస్తే ఈ నడుము నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం.
విచ్చలవిడిగా ట్రెమడాల్ ఇంజెక్షన్‌ల వాడకం.. అమ్మో అంత డేంజరా?.. ఏపీ ప్రభుత్వం సీరియస్
Andhra Pradesh Tramadol Injection Violations: ఏపీలో ట్రెమడాల్ ఇంజెక్షన్ల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యల ప్రారంభించింది. డాక్టర్ల సూచన మేరకు వైద్య అవసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ఇంజెక్షన్‌లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. చాలామంది నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఇంజెక్షన్లను మత్తు కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని మెడికల్ షాపుల్లో నకిలీ బిల్లలుతో మోసం చేస్తున్నట్లు చెబుతున్నారు.
నరాల బలహీనతతో పాటు నొప్పి తగ్గడానికి తినాల్సిన వెజ్ ఫుడ్స్, ఏమేం తినాలో తెలుసా?
ఈ రోజుల్లో చాలా మంది నరాల బలహీనతతో పాటు నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. చేతుల్లో తిమ్మిర్లు, కాళ్లలో బలహీనతతో రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. అయితే, నరాల నొప్పి లేదా బలహీనతతో బాధపడేవారికి మంట, వాపుల్ని తగ్గించే పౌష్టికాహారం ఎంతో మేలు చేస్తుంది. ప్లాంట్ బేస్ట్ డైట్ అంటే మొక్కల ఆధారిత ఆహారం నరాల్ని ఆరోగ్యంగా ఉంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
బయట రెస్టారెంట్లలో లభించే ఆహారాల్లో నరాల నొప్పిని పెంచే పదార్థాలు ఉండే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లోనే తాజా పదార్థాలతో వంటలు తయారుచేసుకోవడం ఎంతో సురక్షితం. ప్రతిరోజూ కనీసం అర కప్పు నుంచి ఒక కప్పు పరిమాణంలో తాజా లేదా నిల్వ ఉంచిన కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ బ్లాగ్‌లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం నరాల బలహీనతను తగ్గించే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆరు ముఖ్యమైన ఆహారాలపై ఓ లుక్కేద్దాం.
ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంపు.. మంత్రి కీలక ప్రకటన
AP Govt Extends Pension Applications Till September 18: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నేటితో గడువు ముగుస్తోంది.. సెప్టెంబర్ 18వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటే.. ఈ రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 2,050 పోస్టులు, దరఖాస్తు వివరాలివే!
Andhra Pradesh Police Recruitment 2026 Si And Constable Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏపీలో పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. అభ్యర్థులు పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానాన్ని పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. మళ్లీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు నియోజకవర్గ బాధ్యతలు
Kancharla Srikanth As Local Body Elections Kuppam In Charge: ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోకవర్గ బాధ్యతల్ని మళ్లీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించారు. చంద్రబాబును కలిసిన తర్వాత శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెలలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను నియమించారు. తాజాగా చంద్రబాబు శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

