today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని షష్ఠి తిథి నాడు, గురువారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS-BJP పొత్తు వార్తలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ స్థానాలను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఏఐ, హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడి, దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక వంటి అంశాలపైనా కేటీఆర్ మాట్లాడారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆరోగ్యంపై వదంతులు.. బ్రిక్స్ సమ్మిట్‌లో స్ట్రోక్ వచ్చిందా?
ఏడేళ్ల తర్వాత ఇండియాలో పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అయితే, ఈ సదస్సు సమయంలో ఆయన స్ట్రోక్ వచ్చిందని, హుటాహుటిన తన పర్యటన ముగించి చైనాకు బయలుదేరారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని అటు చైనా ప్రభుత్వం గానీ.. ఇటు భారత ప్రభుత్వం గానీ నిర్దారించలేదు. కానీ, ఆయన అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారమే సాగినట్టు చైనా వెలువరించిన ప్రకటన స్పష్టం చేసింది.
రో-కో ఈజ్ బ్యాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..!
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. గిల్ సారథ్యంలోని వన్డే జట్టులో రోహిత్, కోహ్లీలతో పాటు కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఆసియా క్రీడల నుంచి తప్పించి, వన్డే జట్టులోకి తీసుకున్నారు. నమన్ ధీర్, ఆకిబ్ నబీ కొత్తగా జట్టులోకి రాగా, పంత్‌కు చోటు దక్కలేదు. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రాజ్ నిగమ్ ఏషియన్ గేమ్స్ జట్టులోకి వచ్చాడు.

