Zombie Reddy 2 Upendra: రియల్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా అదిరే సర్ ప్రైజ్ వచ్చేసింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అతని ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మామూలుగా లేదు.
విశాఖలో పేదలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 28వేల కుటుంబాలకు శాశ్వత పట్టాలు
Visakhapatnam 28000 House Pattas Distribution: విశాఖపట్నం జిల్లాలో పేదలకు చంద్రబాబు తీపికబురు చెప్పారు. మొత్తం 11 మండలాల్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గృహ స్థలాలను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు 28 వేలపేద కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన భూమి పట్టాలు జారీ చేశారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నం వస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
విమానం గాల్లో ఉండగానే ఇద్దరు ప్రయాణికుల ఫైట్.. ఒకరినొకరు తీవ్రంగా గుద్దుకున్న వైనం.. వీడియో వైరల్
లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు ప్రయాణిస్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గొడవ పడ్డారు. మొదట మాటలతో మొదలైన వీరి వాగ్వాదం క్షణాల్లోనే ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘర్షణలో ఒకరి షర్టు చిరిగిపోగా… విమానంలోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో యాజమాన్యం విచారణకు ఆదేశించింది.
మా పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్నికాపాడుతుంది.. చంద్రబాబు, జగన్‌కు ఓట్ల కోసం రెడ్లు కావాలి: విజయసాయిరెడ్డి
Vijaya Sai Reddy Anantapur Press Meet Comments: కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించగా.. ఇవాళ అనంతపురంలో మాట్లాడారు. మరోసారి చంద్రబాబు, జగన్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. వారిద్దరు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. రాయలసీమలో సమస్యల్ని ప్రస్తావిస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు. యువత తాము ఏర్పాటు చేయబోయే పార్టీలోకి రావాలిని పిలుపునిచ్చారు విజయసాయిరెడ్డి.

