Adani Power Q2 Results: దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు క్యూ2 ఫలితాల్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే పలు ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీలు ఫలితాలు వెల్లడించగా, తాజాగా అదానీ గ్రూప్ నుంచి అదానీ పవర్ క్యూ2 ఫలితాలు వెల్లడించింది. ఏకంగా నికర లాభం వార్షిక ప్రాతిపదికన రికార్డు స్థాయిలో 142 శాతం పెరగడం విశేషం. కార్యకలాపాల ఆదాయం కూడా దాదాపు 40 శాతం వరకు పెరగడం విశేషం. అయినా స్టాక్ మాత్రం పడిపోతోంది.


