సికింద్రాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అపార్ట్మెంట్లో రాత్రి ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలిక కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు విక్రమ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిన్నారి కుటుంబం నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అనంతరం అపార్ట్మెంట్ క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడి ఆచూకీ, ఘటన వెనుక కారణాలు, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


