HomeTELANGANAక్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో మోసం.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి..!

క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో మోసం.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి..!

ఖమ్మం నగరంలోని బోనకల్లు క్రాస్‌రోడ్డులో క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో ఓ కిరాణా దుకాణం యజమాని ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తి తీసుకుని పరారయ్యాడు. ఫోన్‌లో రుణ యాప్‌ ద్వారా రూ.2.80 లక్షల రుణానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. అనంతరం యజమాని బ్యాంకు ఖాతా పరిశీలించగా రూ.80 వేలు మరో ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించాడు. అదే నంబర్‌తో కొత్త సిమ్‌ తీసుకున్న తర్వాత మరో రుణ దరఖాస్తు జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments