Shani Nakshatra Transit 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు. అందుకే శని గమనంలో వచ్చే చిన్న మార్పు కూడా జ్యోతిష్యపరంగా చాలా కీలకమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న శుక్రవారం రోజున సాయంత్రం 7:28 గంటలకు శని దేవుడు రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించనున్నారు. ఇదే నక్షత్రంలో ఈ ఏడాది చివరి వరకు అంటే దాదాపు 83 రోజుల పాటు నివాసం ఉండనున్నారు. ఈ నక్షత్రానికి శనీశ్వరుడే అధిపతిగా ఉంటాడు.
ఈ సమయంలో 12 రాశుల వారిని శనిదేవుడు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగులో ఉన్న మీ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. ఈ సందర్భంగా శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల రాబోయే 83 రోజుల పాటు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


