మన భోజనంలో పప్పు ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది దీనిని అన్నంతో తినడానికి ఇష్టపడతారు. నార్త్ సైడ్ రోటీలతో పప్పు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కలయిక జీర్ణక్రియకు మంచిది. పోషకాల సమతుల్యతను అందిస్తుంది. అందువల్ల, ఆరోగ్య పరంగా చూస్తే ప్రతిరోజూ పప్పు, అన్నం తినడంలో ఎలాంటి తప్పు లేదు. చాలా మంది కందిపప్పుని ఎక్కువగా వండుకుంటారు.
ఇంకొందరు పెసరపప్పు, మరికొందరు మినపప్పు ఇలా డిఫరెంట్ స్టైల్‌లో వండుకుని తింటుంటారు. అయితే, చాలా సార్లు పప్పు మరీ పల్చగానో లేదంటే గట్టి ముద్దగానో తయారవుతుంది. దీంతో, ఆ పప్పు తినడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. మీరు వండినప్పుడు పప్పు మరీ నీళ్లలాగానో, గట్టిగానో లేదంటే సరిగ్గా ఉడకకుండానో వస్తుంటే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఏ పప్పుకి ఎన్ని కప్పుల నీళ్లు పోయాలి, ఎన్ని విజిల్స్ రావాలి అన్న పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.


