న్యూజిలాండ్తో అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తరఫున 28 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయడంతో అతనికి చోటు దక్కింది. అలాగే గాయం నుంచి కోలుకున్న వరుణ్ చక్రవర్తికి కూడా సెలెక్టర్లు మళ్లీ అవకాశం కల్పించారు.


