HomeAndhra Pradeshఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట.. 12 అంశాలకు ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట.. 12 అంశాలకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.58.42 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు 66 పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించారు. 2026-27 ‘తల్లికి వందనం’ పథకానికి రాటిఫికేషన్‌ ఇచ్చారు. విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్ కోచింగ్‌ అందించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు ఆమోదం తెలిపారు. విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు నూతన పాలసీ-2026కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. భూముల బదలాయింపులు, ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments