తనకు పరిచయమైన మహిళ.. ప్రభుత్వ అధికారిణి అంటే నమ్మి మోసపోయాడు ఓ రాజకీయ నేత. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అసెంబ్లీ స్పీకర్ సహా రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కానీ, చివరకు ఆమె అతడ్ని నిలువునా ముంచేసింది. ఇంటిలోని బంగారు నగలు, వెండి సహా విలువైన వస్తువులతో ఉడాయించింది. చివరకు ఆమె తనను మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించిన అతడు లబోదిబోమంటున్నాడు. విచిత్రమైన ఈ ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది.


